సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇటీవలే విడుదలైన విషయం విదితమే. కాగా ఈ ఓఎస్ ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్లలో లభిస్తుండగా.. ఈ ఓఎస్ అప్‌డేట్ పొందనున్న తన స్మార్ట్‌ఫోన్ల జాబితాను సోనీ విడుదల చేసింది. ఈ క్రమంలో సోనీకి చెందిన ఎక్స్‌పీరియా 1, 5, 10, 10 ప్లస్, ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2, ఎక్స్‌జడ్2 కాంపాక్ట్, ఎక్స్‌జడ్2 ప్రీమియం, ఎక్స్‌జడ్3 ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను విడుదల చేయనున్నట్లు సోనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌లో భాగంగా ఫోన్లలో డార్క్ థీమ్, స్మార్ట్ రిప్లయి, ఫోకస్ మోడ్, డెడికేటెడ్ ప్రైవసీ సెక్షన్ తదితర ఫీచర్లు లభిస్తాయని సోనీ తెలిపింది.
ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ పొందనున్న సోనీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!