కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(kiff)లో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ 'SUMMER RHAPSODY'కు ఉత్తమ భారతీయ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వేదికగా ఈనెల 8 నుంచి 15 వరకు జరిగిన వేడుకల్లో తెలంగాణకు చెందిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ శ్రావణ్ కటికనేని 'గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్' అవార్డును అందుకున్నారు. అవార్డు, సర్టిఫికెట్‌తో పాటు రూ.5లక్షల నగదు బహుమతిని స్వీకరించారు. లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రావణ్ కటికనేని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కాళి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జ్ఞాన శేఖర్ వీస్ చిత్రాన్ని నిర్మించారు. అట్టహాసంగా జరిగిన 25వ ఫిల్మ్ ఫెస్టివల్‌ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రారంభించారు.
20 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లో కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి 'జై తెలంగాణ' కావడం విశేషం. ఓ గ్రామంలో 8ఏండ్ల బాలుడు తన తల్లి పొలంలో తీరికలేకుండా పనిచేస్తూ ఉంటే తన చెల్లెలిని జాగ్రత్తగా చూసుకునే పనిని అతనికి అప్పగిస్తుంది. ముగ్గురు చుట్టూ తిరిగే సన్నివేశాలతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.
గతంలో తెలుగులో విజయవంతమైన గమ్యం, వేదం చిత్రాలకు శ్రావణ్ పనిచేశారు. ఆనందో బ్రహ్మా సినిమాకు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లోనూ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. వేదం, మణికర్ణిక, మళ్లి మళ్లి ఇది రానిరోజు, ఎన్టీఆర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా తన ప్రతిభను ప్రదర్శించారు.