ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

ఒంటరి మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి


సాక్షి, ప్రకాశం:‍ ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి ఘటన కలకలం రేపింది. గురువారం నగరంలోని కనిగిరి సాయిబాబా గుడి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకొంది. దీంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. గుర్తుతెలియని దుండగుడు మహిళను కత్తితో గొంతుపై దాడిచేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మహిళను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతోపాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దాడికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.