10వేలు దాటిన క‌రోనా మృతులు

 నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేలు దాటింది.  అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  గ‌త ఏడాది క‌రోనా ప్ర‌బ‌లిన నాటి నుంచి హాప్‌కిన్స్ వ‌ర్సిటీ మ‌ర‌ణాల సంఖ్య‌ను న‌మోదు చేస్తోంది.  అయితే ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల 50 వేల‌కు చేరుకుంటోంది.  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిషేధ ఆజ్ఞ‌లు జారీ చేసింది.  ఆ రాష్ట్రంలో సుమారు 40 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న‌ది.  ఇటలీలో నిన్న ఒక్క రోజే 427 మంది మ‌ర‌ణించారు.  చైనా మృతుల సంఖ్య‌ను ఇట‌లీ దాటేసింది.