శనివారం ఒక్కరోజే 92 కేసుల నమోదు


మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుతూనే ఉంది. శనివారం ఒక్క రోజే కొత్తగా 92 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనాబారిన పడినవారి సంఖ్య 1666కు చేరింది. దీనివల్ల దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఒకే పాజిటివ్‌ కేసు నమోదైన జిల్లాలు ఎనిమిది ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.