నోవెల్ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగించాలా లేదా, ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ప్రధాని మోదీ.. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియోకాన్పరెన్స్‌లో మాట్లాడారు. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొన్ని సూచనలు చేశారు. లాక్‌డౌన్ కొనసాగింపు అనేది జాతీయ స్థాయిలోనే ఉండాలన్నారు. లాక్‌డౌన్‌పై రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే, అది అంత ప్రభావంతంగా ఉండదని సీఎం కేజ్రీ తెలిపారు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేస్తే, అప్పుడు రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలను ఒక్కసారిగా అనుమతించరాదు అని మోదీతో కేజ్రీ తెలిపారు.